లక్ష్మీ మంచు నూతన షో 'కమింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ లక్ష్మీ మంచు'
- October 08, 2020
లక్ష్మీ మంచు తన కెరీర్లో ఓ నటిగా అమెరికన్ టీవీ సిరీస్ 'లాస్ వేగాస్'తో ప్రారంభించారు. మరికొన్ని ఇంగ్లీష్ టీవీ షోలలో నటించాక ఇండియాకు తిరిగొచ్చిన ఆమె.. టాలీవుడ్లో నటిగా ఎంట్రీ ఇచ్చి, తనదైన ముద్ర వేశారు.
ఓవైపు సినిమాలలో నటిస్తూనే, తెలుగు టీవీ షోలకు ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తూ వచ్చారు లక్ష్మి. ఆమె హోస్ట్‌గా వ్యవహరించిన 'ఫీట్ అప్ విత్ స్టార్స్' చాట్ షోకు వీక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. లాక్డౌన్ పీరియడ్‌లో 'లాక్డ్ అప్ విత్ లక్ష్మీ మంచు' పేరుతో పలువురు ఫేమస్ సినీ, పొలిటికల్ సెలబ్రిటీలతో ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారా ఆమె ఇంటరాక్ట్ అయ్యారు.
అక్టోబర్ 8 లక్ష్మీ మంచు బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె ఒక ప్రోమో ద్వారా తన నూతన షోను అనౌన్స్ చేశారు. సౌత్ బే సమర్పిస్తోన్న ఆ షో పేరు 'కమింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ లక్ష్మీ మంచు'.
'లాక్డ్ అప్ విత్ లక్ష్మీ మంచు' తరహాలోనే, ఈ షోలో ఆమె ఫిలిమ్స్, స్పోర్ట్స్, ఫ్యాషన్, ఫుడ్.. తదితర రంగాలకు చెందిన సెలబ్రిటీలను ఆమె ఇంటర్వ్యూ చేయనున్నారు.
ప్రోమోలో రాజమౌళి, తాప్సీ పన్ను, సెందిల్ రామమూర్తి, సానియా మీర్జా, ప్రకాష్ అమృతరాజ్, శంతను, నిఖిల్, బిభు మొహాపాత్ర, పూజా ధింగ్రా, అన్నా పొలీవియౌ తదితర ఫేమస్ పర్సన్స్ కనిపిస్తున్నారు.
సౌత్ బే ప్రెజెంట్ చేస్తున్న 'కమింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ లక్ష్మీ మంచు' షో త్వరలోనే ప్రారంభం కానున్నది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!