ఈ సెమెస్టర్ ముగిసే వరకు డిస్టెన్స్ లెర్నింగ్ పొడిగించిన సౌదీ అరేబియా
- October 09, 2020
రియాద్:కరోనా తీవ్రత కొనసాగుతుండటంతో ఇప్పుడప్పుడే తరగతులను ప్రారంభించేది లేదని స్పష్టత ఇచ్చింది సౌదీ ప్రభుత్వం. ఫస్ట్ సెమిస్టర్ ముగిసే వరకు ఆన్ లైన్ విధానంలోనే పాఠాలు బోధించాలని నిర్ణయించింది. కోవిడ్ 19 కారణంగా ఈ ఏడాది ఆలస్యంగా విద్యా సంవత్సరం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆగస్ట్ 30 నుంచి స్కూల్స్ ప్రారంభమైనా.. విద్యాశాఖ ఉన్నతాధికారులు, వైద్య ఆరోగ్య శాఖ నివేదికలకు అనుగుణంగా ఆన్ లైన్ లోనే క్లాసులు నిర్వహిస్తున్నారు. నేరుగా తరగతులను నిర్వహించే అంశంపై అప్పటి పరిస్థితులను బట్టి ఆరోగ్య శాఖ, విద్యాశాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని గతంలోనే ప్రకటించింది విద్యా మంత్రిత్వ శాఖ. అయితే..ప్రస్తుతం కరోనా వైరస్ ఇంకా నియంత్రణలోకి రాకపోవటంతో ఇప్పుడే నేరుగా తరగతుల నిర్వహించొద్దంటూ వైద్య శాఖ ఉన్నతాధికారులు నివేదిక ఇవ్వటంతో..ఫస్ట్ సెమిస్టర్ ముగిసే వరకు ఆన్ లైన్ ద్వారానే క్లాసులు నిర్వహించనున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన