భారత్ లో నిన్న ఒక్కరోజే 70,496 కరోనా కేసులు..
- October 09, 2020
న్యూ ఢిల్లీ:భారత్‌లో కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 70,496 మందికి కొత్తగా వ్యాధి నిర్ధారణ అయింది. 964 మంది బాధితులు మృతి చెందారు. 11,68,705 శాంపిల్స్ పరీక్షించగా.. ఈ స్థాయిలో కేసులు బయటపడ్డాయి. నిన్న ఒక్కరోజే 78,365 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 85.52 శాతానికి చేరింది.
దేశ వ్యాప్తంగా 69,06,161 మందికి కరోనా సోకింది. వారిలో 1,06,490 మంది మృత్యువాతపడ్డారు. 59,06,069 మంది కోలుకున్నారు. ఇంకా 8,93,592 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 8,46, 34,680 మందికి కరోనా పరీక్షలు చేశారు. అత్యధికంగా మహారాష్ట్రలో 14,93,884 మందికి వ్యాధి సోకగా.. 39,430 మంది మరణించారు. ఆ తర్వాత స్థానంలో ఏపీలో 7,39,719 కేసులు బయటపడ్డాయి. వీరిలో 6,128 మంది చనిపోయారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా 36,754,006 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 1,066,856 మంది ప్రాణాలు కోల్పోయారు. 27,667,693 మంది కోలుకోగా.. 8,019,457 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన