మస్కట్:38 డిగ్రీల టెంపరేచర్ దాటితే పీసీఆర్ టెస్ట్.. ఒమన్ ఎయిర్ పోర్టు ఆదేశాలు
- October 09, 2020
మస్కట్:ఒమన్ చేరుకునే ప్రయాణికులకు జారీ చేసిన మార్గనిర్దేశకాలలో మరో నిబంధనను జత చేశారు విమానాశ్రయ అధికారులు. శరీర ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ దాటితే..విమాన ప్రయాణానికి ముందే తప్పనిసరిగా కోవిడ్ నిర్ధారణ పరీక్ష పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని సూచించింది. పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాతే విమాన ప్రయాణానికి అనుమతి ఇస్తామని వెల్లడించింది. ఇప్పటివరకు ఒమన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆయా దేశాల నిబంధనల మేరకు ప్రయాణికులు నడుచుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. అలాగే ఒమన్ చేరుకునే ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకోగానే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవాల్సి వచ్చేది. కానీ, కొత్త సూచనల మేరకు శరీర ఉష్ణోగ్రత 38 డిగ్రీలు దాటితే కోవిడ్ లక్షణాలు ఉన్నా, లేకున్నా ఖచ్చితంగా పీసీఆర్ టెస్ట్ చేయించుకొని ఫలితాలు వచ్చిన తర్వాతే ప్రయాణానికి అనుమతి ఇస్తామని విమానాశ్రయ అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు