బహ్రెయిన్:ఇస్లాంను కించపరిచేలా ట్వీట్ చేసిన మహిళకు ఏడాది జైలుశిక్ష
- October 09, 2020
మనామా:ఇస్లాం మతాన్ని, ఆచారాలను కించపరిచేలా వ్యాఖ్యానించినందుకు ఓ మహిళకు ఏడాది పాటు నాన్-సస్పెండ్ జైలు శిక్ష విధించింది బహ్రెయిన్ లోయర్ క్రిమినల్ కోర్టు. శిక్ష పడిన మహిళ తన ట్విట్టర అకౌంట్లో ఇస్లాం మత ఆచారాలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిందని యాంటీ సైబర్ క్రైమ్ అధికారులు గుర్తించారు. దీంతో ఆమె ట్విట్టర్ అకౌంట్ వివరాలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ దృష్టికి తీసుకువెళ్లింది. ఇస్లాం మత ఆచారాలను కించపరిచేలా ఆమె వ్యాఖ్యానించినట్లు వివరించింది. దీనిపై దర్యాప్తు జరిపించిన పబ్లిక్ ప్రాసిక్యూషన్..ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు మహిళ నేరానికి పాల్పడినట్లు ప్రాధమికంగా నిర్ధారించుకుంది. ఆమె కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. అనంతరం న్యాయ విచారణ చేపట్టి ఆ మహిళకు ఏడాది పాటు నాన్-సస్పెండ్ జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!