దుబాయ్ లోని వృద్ధులు,చిన్నారులు,గర్భిణిలకు ఉచితంగా ఫ్లూ వ్యాక్సిన్

- October 09, 2020 , by Maagulf
దుబాయ్ లోని వృద్ధులు,చిన్నారులు,గర్భిణిలకు ఉచితంగా ఫ్లూ వ్యాక్సిన్

దుబాయ్:వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు, ఐదేళ్లలోపు చిన్నారులు, గర్భిణిలకు ఉచితంగా ఫ్లూ వ్యాక్సిన్ వేస్తున్నట్లు దుబాయ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఫ్లూ వల్ల ఎదురయ్యే శ్వాసకోస ఇబ్బందులు ఎదుర్కొనేందుకు వీలుగా ఈ సున్నిత వర్గాలకు టీకాలు వేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత సీజన్ లో ఫ్లూ ఎక్కువగా వ్యాపించే అవకాశాలు ఉందని, ఈ ఫ్లూ వైరస్ ఒకరి నుంచి ఒకరి అతి సునాయసంగా వ్యాపిస్తుందని వెల్లడించారు. జలుబు, దగ్గు ఉన్నవాళ్లు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, తరచుగా చేతులు శుభ్రంగా కడుక్కొవాలని సూచించారు. ఫ్లూ కూడా కోవిడ్ 19 తరహా లక్షణాలే కలిగి ఉంటాయి. దీంతో గత బుధవారం నుంచి ఫ్లూ వ్యాక్సిన్ అవసరాన్ని వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంచేలా ప్రచారం చేపట్టింది దుబాయ్ వైద్య ఆరోగ్య శాఖ. సున్నిత వర్గాలుగా పేర్కొన్న వారు స్వచ్ఛంగా ఆరోగ్య కేంద్రాలకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రజలను అప్రమత్తం చేస్తోంది. దుబాయ్ పౌరులు అందరికీ ఉచితంగానే వ్యాక్సిన్ అందిస్తున్నామని, దుబాయేతరులకు మాత్రం 50 దిర్హామ్ లు చెల్లించాల్సి ఉందని అధికారులు స్పష్టం చేశారు. గర్భిణిలు కూడా వ్యాక్సిన్ వేయించుకోవటం వల్ల తనతో పాటు గర్భంలోని శిశువు కూడా ప్రయోజనాలు ఉంటాయని వివరించారు. 

ఫ్లూ టీకాలు ఉచితంగా అందించే కేంద్రాలు....

-దుబాయ్ లోని జుమేరా లేక్ టవర్స్, అప్‌టౌన్ మిర్డిఫ్, సిటీ వాక్ (స్మార్ట్ సేలం సెంటర్) లోని మూడు దుబాయ్ హెల్త్ అథారిటీ-డీహెచ్‌ఏ మెడికల్ ఫిట్‌నెస్ సెంటర్లలో ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం 7 నుంచి రాత్రి 7.30 గంటల వరకు టీకాలు వేస్తున్నారు.

-ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో టీకాలు వేయించుకునేందుకు దుబాయ్ నివాసితులు 800DHA (800342) కు కాల్ చేయాలి. దుబాయ్ పరిధిలోని ఏదైనా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో టీకాలు వేయడానికి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు.

-అల్ బడా, అల్ లుసైలీ, అల్ మంఖూల్, అల్ సఫా, నాడ్ అల్ షెబా, జబీల్, మిజార్, త్వార్ ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఆదివారం నుండి గురువారం వరకు ఉదయం 7.30 నుండి రాత్రి 9.30 వరకు తెరిచి ఉంటాయి. ఇక మహిళలు, గర్భిణీలకు మాత్రమే కేటాయించిన అల్ మమ్జార్ ఆరోగ్య కేంద్రం ఉదయం 7.30 నుండి రాత్రి 9.30 వరకు తెరిచి ఉంటుంది.

-24 గంటల పాటు సేవలు అందించే అల్ బర్షా, నాడ్ అల్ హమర్ కేంద్రాల్లో ఉదయం 7.30 నుంచి రాత్రి 9.30 మధ్య మాత్రమే టీకా సేవలను అందుబాటులో ఉంటాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com