అబుధాబి:కోవిడ్ 19 నేపథ్యంలో కమ్యూనిటీ స్పోర్ట్స్ ఈవెంట్ కు నిబంధనలు
- October 10, 2020
అబుధాబి:అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఒక్కో రంగంపై ఆంక్షలు ఎత్తివేస్తున్న అబుధాబి..వైరస్ ప్రబలే అవకాశాలున్న రంగాలకు కీలక సూచనలు చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా కమ్యూనిటీ స్పోర్ట్స్(సాముహిక క్రీడలు) ఈవెంట్లకు సంబంధించి అనుసరించాల్సిన నిబంధనలను ప్రకటించింది అబుధాబి క్రీడా మండలి. రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, మెరైన్ ఈవెంట్స్, ట్రైయత్లాన్ యాక్టివిటీస్ తరహా ఈవెంట్లకు అబుధాబి క్రీడా మండలి వెబ్ సైట్ నుంచి ముందుగానే అనుమతి తీసుకోవాలి. అలాగే ఈవెంట్ల నిర్వహణ సమయంలో క్రీడాకారుల ప్రవేశ మార్గం, బయటికి వచ్చే మార్గాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. బహుమతి ప్రదానం చేసే వేదిక విషయంలోనూ అన్ని జాగ్రత్తలను పాటించాలని అబుధాబి క్రీడా మండలి ప్రకటించింది. కోవిడ్ తీవ్రత నేపథ్యంలో పన్నెండేళ్లలోపు వారు, అలాగే 60 ఏళ్లకు మించిన వారికి, దీర్ఘకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అనుమతి లేదు.
తాజా వార్తలు
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం









