7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ప్రారంభం
- October 10, 2020
హైదరాబాద్: వంగూరి ఫౌండేషన్ అమెరికా వారి ఆధ్వర్యంలో ఏడవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా శనివారం మధ్యాహ్నం 1:30 గంటలకు డా.వంగూరి చిట్టెం రాజు ప్రారంభించారు. ఆసియా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఆఫ్రికా, అమెరికా ఖండాల్లోని అన్ని దేశాల్లో ఉన్న తెలుగు సాహిత్యాభిమానుల వేదికగా ప్రారంభమయ్యింది.ఈ రెండు రోజుల పాటు 32 గంటలు ఏకధాటిగా సదస్సు జరగనుంది. వీడియో జూమ్ ద్వారా జరిగే ఈ సదస్సును తెలుగు భాషను ప్రేమించే వారు ప్రపంచంలో ఎక్కడ్నుంచైనా, ఏ సమయంలోనైనా వీక్షించొచ్చు.యూఏఈ నుంచి కూడా డా.కోడి రామారావు,డా.శ్రీరాములు కొప్పిశెట్టి,డా.నారాయణ దేవనపల్లి,ఆదిభట్ల కామేశ్వర శర్మ,కూరెళ్ల కోదండరాం,యామిని రాజశేఖర్ పాల్గొంటున్నారు.
ప్రపంచ నలుమూలల నుంచి సుమారు 200 మంది అతిథులు, వక్తలు పాల్గొని ప్రసంగించనున్నారు. 15 పుస్తకావిష్కరణలు, వివిధ చర్చావేదికలతో ఆసక్తికరంగా కొనసాగనున్న ఈ సదస్సు ప్రత్యక్ష ప్రసారాన్ని అందరూ ఈ క్రింది లింకుల ద్వారా మీ ఇంటి నుంచే వీక్షించొచ్చు.
YouTube Links:
https://bit.ly/3is8lsy Vedika 1 to vedika 11
https://bit.ly/2EUJEHo
Vedika 12 to vedika 15
Facebook Links:
https://bit.ly/3itifu3
https://bit.ly/3nl0z7t
తాజా వార్తలు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!







