ఇక సులభంగా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చేసుకునేలా డిజిటలైజ్డ్ వ్యవస్థ ప్రారంభం
- October 11, 2020
యూఏఈ:పేషెంట్లకు నాణ్యమైన వైద్యం, సులభంగా ఇన్సూరెన్సు క్లెయిమ్ ల పరిష్కారం కోసం సమీకృత డేటా బేస్ సెంటర్ ను ప్రారంభించింది. దీన్నే పోస్ట్ ఆఫీస్ గా పిలుచుకుంటున్నారు. ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా జాతీయ వైద్య నివేదికలను సమీకృత కార్యక్రమం(రియాతి) నిర్వహిస్తారు. అంటే యూఏఈలోని ఆస్పత్రులు, క్లినిక్స్, హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కు రియాతి అనుసంధానం అయి ఉంటుంది. చికిత్స పొందే రోగి వివరాలను, రోగికి అందుతున్న చికిత్స వివరాలను ఎప్పటికప్పుడు రియాతిలో అప్ డేట్ చేస్తారు. దీంతో ఆ రోగికి ఇంకా మెరుగైన వైద్య సేవలను అందించే విధానాలు ఏమైనా ఉన్నాయా అనే వివరాలను రియాతి(పోస్ట్ ఆఫీస్) సూచిస్తుంది. అదే సమయంలో రోగికి ఇన్సూరెన్స్ ఉందా..ఉంటే చికిత్సను బట్టి అతనికి చెల్లించాల్సిన బీమా డబ్బులను ఆన్ లైన్ అటోమెటిగ్గా సదరు ఆస్పత్రికి చెల్లించేలా పోస్ట్ ఆఫీస్ చర్యలు తీసుకుంటుంది. దీంతో బీమా క్లెయిమ్ లలో చికిత్స పొందుతున్న రోగికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఒకవేళ బీమా తిరస్కరించబడితే...అది ఎందుకు తిరస్కరించబడింది..క్లెయిమ్ చేసుకునేందుకు ఉన్న అవకాశాలను కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారా ట్రాక్ చేయవచ్చు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







