కువైట్ పర్యటనలో భారత కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్..ఈ రోజు అధికారులతో భేటీ

- October 12, 2020 , by Maagulf
కువైట్ పర్యటనలో భారత కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్..ఈ రోజు అధికారులతో భేటీ

కువైట్ సిటీ:భారత పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కువైట్ పర్యటనలో ఉన్నారు. ఆయన ఈ రోజు అధికారిక సమావేశంలో పాల్గొంటారు. ఇటీవలె కన్నుమూసిన కువైట్ అమీర్ షేక్ సబా అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా మృతికి సంతాపం తెలుపుతు భారత రాష్ట్రపతి, ప్రధాని పంపిన లేఖలను కువైట్ పాలకులకు అందజేస్తారు. అలాగే కువైట్ కొత్త అమీర్ గా బాధ్యతలు స్వీకరించిన షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబాతో పాటు క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషేల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబాకు భారత ప్రభుత్వం తరపున కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ శుభాకాంక్షలు తెలుపుతారు. ఇదిలాఉంటే..నిన్న సాయంత్రం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న కేంద్రమంత్రికి కువైట్ విద్యుత్, నీరు, చమురు శాఖ మంత్రి డాక్టర్ ఖలీద్ అలీ అల్ ఫదాల్ సాదరంగా స్వాగతం పలికారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com