వెండితెరపై సౌందర్య బయోపిక్… లక్కీ ఛాన్స్ కొట్టేసిన సాయి పల్లవి

- October 12, 2020 , by Maagulf
వెండితెరపై సౌందర్య బయోపిక్… లక్కీ ఛాన్స్ కొట్టేసిన సాయి పల్లవి

 ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లో బయోపిక్‌ల ట్రెండ్ బాగా నడుస్తోంది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల జీవిత కథలను వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు బయోపిక్‌లు వచ్చాయి. వాటిలో కొన్ని విజయాన్ని సాధించగా.. మరికొన్ని అంతగా ఆకట్టుకోలేదు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మరో బయోపిక్‌ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

దివంగత నటి సౌందర్య బయోపిక్‌ని వెండితెరపైకి తెచ్చేందుకు మలయాళ మూవీ ఇండస్ట్రీలోని ఓ బడా నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కర్ణాటకలో జన్మించిన సౌందర్య దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. తెలుగులో దాదాపుగా టాప్ హీరోలందరితో నటించారు. మహానటి సావిత్రి తరువాత సావిత్రి అంటూ బిరుదును సంపాదించుకున్నారు. ఇక 2004లో ఓ పార్టీ ప్రచారం కోసం వెళ్లిన సమయంలో హెలీకాఫ్టర్‌ ప్రమాదంలో ఆమె మృతి చెందారు. ఆమె జీవితంలో కీలక మలుపులు పెద్దగా లేనప్పటికీ.. సినిమా ఇండస్ట్రీలో ఆమెకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలోనే సౌందర్య బయోపిక్ తీయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక సౌందర్య పాత్రకు గానూ టాలెంటెడ్‌ బ్యూటీ సాయి పల్లవిని సంప్రదించినట్లు టాక్. ఇప్పుడున్న నటీనటుల్లో సహజంగా నటించే వారిలో ఒకరిగా సాయి పల్లవి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో సౌందర్య పాత్రకు ఫిదా బ్యూటీ కచ్చితంగా న్యాయం చేస్తుందని భావిస్తోన్న నిర్మాతలు ఆమెతో సంప్రదింపులు జరపుతున్నట్లు సమాచారం. అసలే ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ వస్తోన్న సాయి పల్లవి ఈ బయోపిక్‌కి ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com