6 నెలల తర్వాత మళ్లీ వ్యాట్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన ఒమన్

- October 13, 2020 , by Maagulf
6 నెలల తర్వాత మళ్లీ వ్యాట్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన ఒమన్

మస్కట్:ఒమన్ ప్రభుత్వం విలువ ఆధారిత పన్ను(వ్యాట్) చట్టాన్ని అమలులోకి తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు ఆరు నెలల మినహాయింపు తర్వాత ఇప్పుడు మళ్లీ వ్యాట్ అమలులోకి రానుంది. కోవిడ్ సంక్షోభంతో వ్యాపార రంగాలు ఒడిదుడుకులు ఎదుర్కొన్న నేపథ్యంలో వారికి ప్రభుత్వం తరపున తగిన ప్రొత్సాహం కల్పించటం కోసం కొన్నాళ్ల పాటు వ్యాట్ ను మినహాయించింది ఒమన్ ప్రభుత్వం. అయితే..ప్రస్తుతం అన్ లాక్ ప్రక్రియతో మళ్లీ వ్యాపార రంగాలు పునరుద్ధరణ కావటంతో వ్యాట్ చట్టాన్ని అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాయల్ డిక్రీని జారీ చేసింది. అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని కొన్ని నిబంధనలను సవరిస్తూ మరో రాయల్ డిక్రీని కూడా తీసుకొచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com