ఆపదలో ఉన్న మహిళను ఆదుకున్న ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్

- October 14, 2020 , by Maagulf
ఆపదలో ఉన్న మహిళను ఆదుకున్న ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్

మస్కట్:తెలంగాణ లోని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ధర్మారావు పేటకు చెందిన సుంకరి అనసూర్య ఈరోజు ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ అధ్యక్షులు నరేంద్ర పన్నీరు మరియు మురళి వడ్లపట్ల సహకారం తో తెలంగాణ కు చేరుకున్నారు.ఉపాధి కోసం ఇంట్లో పనిచేయడానికి  ఒమన్ కు వచ్చిన సుంకరి అనసూర్య  గత కొద్ది నెలలుగా  అనారోగ్య సమస్యల తో ఉన్న తన ఇద్దరు అక్కలను చూడడానికి కరోన కారణంగా విమాన చార్జీలు పెరగడం మరియు తన వీసా గడువు ముగియకపోవడం తో  తమ యజమాని పంపించడానికి అంగీకరించలేదు.ఎటు దిక్కుతోచని స్థితిలో అనసూర్య తన బాధను వీడియో ద్వారా పంచుకోవడం తో అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అది నరేంద్ర పన్నీరు దృష్టికి రావడం తో ఆమె అడ్రస్ కనుక్కుని యజమాని తో మాట్లాడి ఒప్పించి విమాన టికెట్ అందించి ఇండియా పంపించారు. ఈ సందర్భంగా నరేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అనసూర్య కు పునరావాసం కల్పించి ఆదుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు.మురళి వడ్లపట్ల, మంచికట్ల కుమార్, రమేష్ గరిగే, వేమనకుమార్ కాశ తదితరులు సహాయసహకారాలు అందించారు.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com