స్పీడ్‌ రాడార్స్‌పై దాడి: పదిమంది అరెస్ట్‌

- October 14, 2020 , by Maagulf
స్పీడ్‌ రాడార్స్‌పై దాడి: పదిమంది అరెస్ట్‌

రియాద్: స్పీడ్‌ రాడార్స్‌ని దొంగిలించిన కేసులో పది మందిని సౌదీ అరేబియాలో అరెస్ట్‌ చేశారు. మక్కా పోలీస్‌ అధికార ప్రతినిది¸ మేజర్‌ మొహమ్మద్‌ అల్‌ ఘామ్ది మాట్లాడుతూ, ఇద్దరు సౌదీలు అలాగే ఎనిమిది మంది యెమనీలను ఈ కేసులో అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. దొంగిలించిన వస్తువుల్ని నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అర్బన్‌ సెంటర్స్‌లో గంటకు 80 కిలోమీటర్ల వేగం, హైవేలపై 140 కిలోమీటర్ల వేగంతో ఈ రాడార్లు లాక్‌ అయి వుంటాయి. కాగా, నిందితుల్ని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com