హైదరాబాద్:వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి

- October 14, 2020 , by Maagulf
హైదరాబాద్:వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి

హైదరాబాద్:హైదరాబాద్ లో గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం అతలాకుతలమైంది. భారీగా వరద నీరు రావడంతో.. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు కాలనీలకు కాలనీలు మునిగిపోయాయి. కొన్ని చోట్ల జనం పీకల్లోతు నీళ్లలో ఇరుక్కుపోయారు. లోతట్లు ప్రాంతాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. పాతబస్తీలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయాడు. ఎవరూ రక్షించలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ విధంగా వరద ప్రవహిస్తోంది. నగరవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వాహనాలు కొట్టుకుపోయాయి. కొత్తగా వేసిన రోడ్లు కూడా గుంటలు పడ్దాయి. మలక్‌పేట, దిల్‌షుఖ్‌నగర్, ఎల్బీనగర్, నాచారం ఇలా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని తేడాలేదు.. వర్షపునీటిలో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనులపై బయటకు వెళ్లాలన్నా మార్గం లేక అల్లాడిపోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com