సెక్యూరిటీ స్టాఫ్‌ ముసుగులో దొంగతనం

- October 15, 2020 , by Maagulf
సెక్యూరిటీ స్టాఫ్‌ ముసుగులో దొంగతనం

మనామా:24 ఏళ్ళ వ్యక్తి ఒకరు సెక్యూరిటీ స్టాఫ్‌ ముసుగులో దొంగతనానికి పాల్పడినట్లు పోలీస్‌ అధికారులు వెల్లడించారు. నిందితుడు, ఓ అపార్ట్‌మెంట్‌లో దోపిడీకి పాల్పడ్డాడు. ఓ ల్యాప్‌ టాప్‌ అలాగే మరికొన్ని విలువైన వస్తువుల్ని నిందితుడు దొంగిలించినట్లు జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ అండ్‌ ఫోరెన్సిక్‌ ఎవిడెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ వెల్లడించడం జరిగింది. నిందితుడ్ని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి రిఫర్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com