టాటాస్కై యూజర్లు 2 నెలల పాటు ఉచితంగా..
- October 15, 2020
డీటీహెచ్ కంపెనీ టాటాస్కై తాజాగా తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. రెండు నెలల పాటు ఉచితంగా టీవీ చూసే అవకాశాన్ని కల్పిస్తోంది. దీని కోసం టాటా స్కై యూజర్లు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా రీచార్జ్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా చేసిన వారికి టాటా స్కై క్యాష్ బ్యాక్ అందిస్తుంది. టాటా స్కై ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 12 నెలల సబ్‌స్క్రిప్షన్‌పై 2 నెలల రీచార్జ్ మొత్తాన్ని క్యాష్ బ్యాక్ రూపొంలో పొందొచ్చు.
అదే సమయంలో ఆరు నెలల సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే యూజర్లకు ఒక నెల రీచార్జ్ క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది. అంటే ఏడాదికి రీచార్జ్ చేసుకుంటే రెండు నెలలు, ఆరు నెలలకు రీచార్జ్ చేసుకుంటే ఒక నెల ఉచితంగా టాటా స్కై ఛానల్స్ వీక్షించొచ్చు. ఈ ఆఫర్ పొందాలని భావించే వారు కంపెనీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే రీచార్జ్ చేసుకోవలసి ఉంటుంది. యూజర్ల అకౌంట్లలోకి క్యాష్ బ్యాక్ మొత్తం 7 రోజుల్లోగా వచ్చి చేరుతుంది. 2 నెలల క్యాష్ బ్యాక్ ప్లాన్ ఎంచుకుంటే తొలి నెల క్యాష్ బ్యాక్ 48 గంటలలోగా అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. రెండో నెల క్యాష్ బ్యాక్ 7 రోజుల్లోగా వస్తుంది. కాగా బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. వీరికి నవంబర్ 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కొత్త కస్టమర్లకు ఈ అవకాశం లేదు. అయితే ఇతర బ్యాంకుల కస్టమర్లకు ఒక నెల క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన