జోర్డాన్ లో ఘాతుకం...ఉలిక్కిపడ్డ నగరం..సోషల్ మీడియా లో నిరసనలు

- October 15, 2020 , by Maagulf
జోర్డాన్ లో ఘాతుకం...ఉలిక్కిపడ్డ నగరం..సోషల్ మీడియా లో నిరసనలు

జోర్డాన్: మనిషి పైశాచికత్వానికి అదుపు లేకుండా పోతోంది అనటానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. జోర్డాన్‌లోని జార్కా నగరంలో 16 ఏళ్ల బాలుడిపై ఒకానొక గ్యాంగ్ దాడి చేసి అతని తన రెండు చేతులను నరికి, కళ్ళను బయటకు లాగేసారు. ఈ ఘటనకు ఉలిక్కిపడింది జోర్డాన్ దేశం.

ఈ నేరానికి సంబంధించిన మొత్తం సంఘటనను వీడియోలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నేరస్తులు. అది గమనించిన జోర్డాన్ అధికారులు, క్రూరమైన ఆ  ఫుటేజ్ ను నిషేధించే అత్యవసర నిర్ణయం జారీ చేయడానికి ముందే అది త్వరగా సోషల్ మీడియాలో వైరల్ అయిపొయింది. ఈ వీడియో చూసిన ప్రజలు నేరంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుపు ఎన్నడూ చూడని అత్యంత కఠినమైన శిక్షను నేరస్తులకు విధించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు.

"దాడి తరువాత బాలుడిని వెంటనే జర్కా ఆసుపత్రికి తరలించటం జరిగింది. మునుపటి హత్యకు ప్రతీకారంగా ఆ బాలుడిపై దుండగులు ఇలా దారుణంగా దాడి చేసినట్టు తెలుస్తోంది. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నేరానికి పాల్పడిన నిందితులను గుర్తించడానికి మేము దర్యాప్తు ప్రారంభించాము. చట్టపరమైన చర్యల కోసం వారిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరుస్తాము" అని పబ్లిక్ సెక్యూరిటీ డైరెక్టరేట్ ప్రతినిధి అమేర్ అల్ సర్తావి చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com