దుబాయ్ గిఫ్ట్ కంపెనీని మోసం చేసిన ‘సీఈఓ’
- October 15, 2020
దుబాయ్: ఓ ప్రైవేటు జెట్ కంపెనీకి చెందిన సీఈవోనంటూ ఓ వ్యక్తి, దుబాయ్‌లోని ఓ గిఫ్ట్ కంపెనీని మోసం చేశాడు. రెండు ఐ ఫోన్లను, రెండు పెర్ఫ్యూములను అలాగే ఓ ఫ్లవర్ బొకేని యూఏఈలోని తన అతిథులకు పంపాల్సిందిగా సదరు దుబాయ్ గిఫ్ట్ కంపెనీని కోరాడు నిందితుడు. నిందితుడు, 25,800 దిర్హాముల విలువైన బ్యాక్ ట్రాన్సాక్షన్స్‌ని ఫేక్ చేశాడు. ఈ విషయాల్ని బుర్ దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్, సీనియర్ ప్రాసిక్యూటర్ అహ్మద్ అబ్దుల్లా అల్ అత్తార్ వెల్లడించారు. దుబాయ్‌లోని ఓ ధనిక కుటుంబానికి చెందినవాడిగా నిందితుడు, గిఫ్ట్ కంపెనీని మోసం చేసినట్లు ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో ముగ్గురు అనుమానితుల్ని దుబాయ్ మిస్డెమీనర్ కోర్టు ముందుంచడం జరిగింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







