దుబాయ్: కోవిడ్ 19 వాక్సిన్ వేయించుకున్న NCEMA జనరల్ డైరెక్టర్
- October 15, 2020
దుబాయ్: జాతీయ అత్యవసర, విపత్తుల నిర్వహణ అధికార విభాగం జనరల్ డైరెక్టర్ ఓబైద్ రషీద్ అల్ షంసీ కోవిడ్ 19 వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆరోగ్య భద్రత కోసం ఫ్రంట్ లైన్ వర్కర్లు అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలన్న వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గనిర్దేశకాల మేరకు ఆయన ఈ రోజు వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్ల ఆరోగ్య శ్రేయస్సుకు యూఏఈ ప్రభుత్వం అధిక ప్రధాన్యత ఇస్తుందని, తమ విధుల్లో భాగంగా సేవలు అందించే సమయంలో వారు వైరస్ బారిన పడకుండా కాపాడుకోవటం తమ బాధ్యత అని NCEMA జనరల్ డైరెక్టర్ అల్ షంసీ అన్నారు. తమ విధుల్లో భాగంగా కోవిడ్ 19 పేషెంట్లతో సన్నిహితంగా ఉండాల్సి వచ్చే వైద్య సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడేందుకు వ్యాక్సిన్ వినియోగించేందుకు యూఏఈ ప్రభుత్వం అత్యవసరంగా అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు