కోవిడ్ 19 ర్యాపిడ్ టెస్టులను ప్రారంభించిన బహ్రెయిన్
- October 16, 2020
మనామా:కోవిడ్ 19 సోకిన వారిని గుర్తించేందుకు ర్యాపిడ్ టెస్టులను ప్రారంభించినట్లు బహ్రెయిన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. సుల్తానేట్ పరిధిలో ట్రయల్ బేస్ గా దాదాపు 20 వేల మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రధానంగా టీచర్లు, విద్యార్ధులు, వైద్య సిబ్బంది, కోవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తులకు, ప్రధామిక వైద్య కేంద్రాల్లోని ల్యాబ్ టెక్నిషియన్లకు కోవిడ్ ర్యాపిడ్ టెస్టులను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ముక్కులో నుంచి నమూనాలను సేకరించి కేవలం 15 ననిమిషాల్లోనే ఫలితాలను రాబొట్టచ్చని, అదీ కూడా ఎలాంటి ప్రత్యేకమైన ల్యాబ్ కూడా అవసరం లేకుండా పరీక్షలు చేయవచ్చని అధికారులు వెల్లడించారు. అయితే..ర్యాపిడ్ టెస్ట్ ఫలితాలు పూర్తిగా పీసీఆర్ టెస్ట్ కు ప్రత్యామ్నాయం మాత్రం కాదని అభిప్రాయపడ్డారు. కానీ, ర్యాపిడ్ టెస్టు ద్వారా చాలా సమయం ఆదా అవటంతో పాటు ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







