వీసా గడువు ముగిసిన ప్రవాసీయులకు అనుమతి లేదని ఒమన్ ప్రకటన

- October 16, 2020 , by Maagulf
వీసా గడువు ముగిసిన ప్రవాసీయులకు అనుమతి లేదని ఒమన్ ప్రకటన

మస్కట్:విదేశాల్లో ఉన్న ఒమన్ వీసాదారులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ఒమన్ ప్రభుత్వం. వీసా గడువు ముగిసిన ప్రవాస కార్మికులను ఒమన్ లోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. కోవిడ్ 19 నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో బ్రిగేడియన్ అల్ అస్మి ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రస్తుతం ఒమన్ ప్రభుత్వం కొత్త వీసాల జారీని నిలిపివేసిందని, విదేశాల్లో ఉంటూ వీసా గడువు ముగిసిన వారు ఒమన్ రావొద్దంటూ ఆయన సూచించారు. కేవలం గడువు ముగియని రెసిడెన్సీ వీసాదారులు, వారి కుటుంబాలకు మాత్రమే ప్రస్తుతం అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు కోవిడ్ 19 నియంత్రణకు నిబద్ధతతో సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారాయన. అయితే..కొన్ని చోట్ల మాత్రం సుప్రీం కమిటీ సూచించిన మార్గనిర్దేశకాలకు విరుద్ధంగా
వ్యవహరించిన ఘటనలు చోటు చేసుకున్నాయని బ్రిగేడియర్ అన్నారు. జనసంచారంపై నిషేధం ఉన్న సమయంలో బయట తిరిగిన వారిని, ఫేస్ మాస్కులు ధరించని వారిని గుర్తించామని...పబ్లిక్ ప్రాసిక్యూషన్ కంటే ముందే వారిని పిలిచి జరిమానాలు విధిస్తామన్నారు. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూషన్ ముగిసిన తర్వాత వారి ఫోటోలు, పేర్లు పేపర్లు వేయిస్తామని వెల్లడించారు. ఇదిలాఉంటే..ఇప్పటివరకు ఒమన్ లో 3,919 మంది వైద్య సిబ్బంది కోవిడ్ 19 బారిన పడినట్లు వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com