బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కవిత
- October 16, 2020
హైదరాబాద్:తెలంగాణలో బతుకమ్మ పండుగ సంబరాలు మొదలయ్యాయి... ఇప్పటికే రకరకాల పూలు సేకరించిన మహిళలు.. ఇప్పుడు బతుకమ్మలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు.. ఇక, రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. బతుకమ్మ పండుగ స్ఫూర్తితో మనందరం ఉమ్మడిగా కరోనాను ఎదుర్కొందాం అంటూ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, సురక్షితంగా, సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలి... ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడకూడవద్దని పేర్కొన్నారు కవిత. కరోనా కారణంగా ఈ ఏడాది, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించడం లేదని స్పష్టం చేసిన ఆమె.. బతుకమ్మ పండుగ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఈ ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన