బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కవిత

- October 16, 2020 , by Maagulf
బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కవిత

హైదరాబాద్:తెలంగాణలో బతుకమ్మ పండుగ సంబరాలు మొదలయ్యాయి... ఇప్పటికే రకరకాల పూలు సేకరించిన మహిళలు.. ఇప్పుడు బతుకమ్మలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు.. ఇక, రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. బతుకమ్మ పండుగ స్ఫూర్తితో మనందరం ఉమ్మడిగా కరోనాను ఎదుర్కొందాం అంటూ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, సురక్షితంగా, సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలి... ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడకూడవద్దని పేర్కొన్నారు కవిత. కరోనా ‌కారణంగా ఈ ఏడాది, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించ‌డం లేదని స్పష్టం చేసిన ఆమె.. బతుకమ్మ పండుగ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఈ ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com