యూఏఈలో నవరాత్రులు ప్రారంభం: ఇంటి వద్దకే పరిమితమవ్వాల్సిందే
- October 17, 2020
యూఏఈ:10 రోజుల నవరాత్రి ఫెస్టివల్ మొదలైంది. అయితే, కరోనా నేపథ్యంలో సెలబ్రేషన్స్ కేవలం ఇళ్ళకే పరిమితమవ్వాలని భారత వలసదారులు అలాగే కమ్యూనిటీ గ్రూప్స్ చెబుతుండడం గమనార్హం.ఎన్నో ఏళ్ళుగా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి యూఏఈ వ్యాప్తంగా. ఈ ఏడాది మాత్రం దాండియా వంటి ‘గ్రూప్ సెలబ్రేషన్స్’ ఏమీ లేకుండానే, నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.బర్ దుబాయ్‌లోని హిందూ టెంపుల్, ఎలాంటి ప్రత్యేక ఉత్సవాలూ లేకుండా సాధారణ వాతావరణం వుంటుందని బర్ దుబాయ్ హిందూ టెంపుల్ జనరల్ మేనేజర్ గోపాల్ కోకాని తెలిపారు.ప్రతి ఉదయం 30 నిమిషాల ప్రేయర్, సాయంత్రం 30 నిమిషాల ప్రేయర్ మాత్రమే వుంటుంది. అన్ని సమయాల్లోనూ సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి. ఉదయం వేళల్లో 150 మంది సాయంత్రం వేళల్లో 300 మంది భక్తులు వచ్చేందుకు అవకాశముంది. బెంగాలీ కమ్యూనిటీ సింధు సెర్మానీ సెంటర్ బర్ దుబాయ్‌లో ప్రధానంగా పెద్దయెత్తున సెలబ్రేషన్స్ నిర్వహిస్తాయి. అయితే, ఈసారి ఆ సెలబ్రేషన్స్ వుండవు.అబుధాబి లోని ఇండియన్ పీపుల్స్ ఫోరం, ఇ-నవరాత్రి ఉత్సవ్ని అక్టోబర్ 23న నిర్వహించనున్నాయి. వర్చువల్ కాంపిటీషన్లో పార్టిసిపెంట్స్ పాల్గొంటారు. చాలా కుటుంబాలు స్పెషల్ యాక్టివిటీస్‌ని ఇంటివద్దనే తక్కువమందితో నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కేవలం వర్చువల్ గేదరింగ్స్ మాత్రమే ఈ సారి వుంటాయని జల్పా షా అనే వలసదారుడు చెప్పారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు