కార్లలో ఒంటరిగా చిన్నారుల్ని వదిలేస్తే అది నేరమే
- October 17, 2020
దుబాయ్: చిన్న పిల్లల్ని ఒంటరిగా కార్లలో వదిలేస్తే, అది నేరమని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. పిల్లల్ని అలా కార్లలో వదిలేయడం వల్ల, వేసవిలో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నిర్లక్ష్యానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని అంటున్నారు దుబాయ్ పోలీసులు. ఈ మేరకు దుబాయ్ పోలీస్ ట్వీట్ ద్వారా సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్‌ని అప్రమత్తం చేస్తున్నారు. 2019 నవంబర్‌లో ఇద్దరు చిన్నారులు అబుదాబీలో చనిపోయారు. కారులో చిన్నారుల్ని తల్లిదండ్రులు వదిలేయగా, ఆ కార్లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. 2007 నుంచి ఈ తరహా ఘటనల్లో 14 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వదీమా చట్టం ప్రకారం, పిల్లల పట్ల తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయి. 18 ఏళ్ళ లోపు చిన్నారుల విషయంలో ఇది వర్తిస్తుంది. జైలు శిక్ష, అలాగే జరీమానా ఈ ఉల్లంఘనకు విధిస్తారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు