మొహమ్మద్ ప్రవక్త జన్మదినం ఆక్టోబర్ 29న సెలవు ప్రకటించనున్న యూఏఈ

మొహమ్మద్ ప్రవక్త జన్మదినం ఆక్టోబర్ 29న సెలవు ప్రకటించనున్న యూఏఈ

యూఏఈ: ఇస్లాం అరాధకుడు మొహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజు ఈ నెల 29న రావొచ్చని అరబ్ యూనియన్ ఖగోళశాస్త్ర సభ్యుడు ఇబ్రహీం అల్ జర్వాన్ తెలిపారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మొహమ్మద్ ప్రవక్త క్రీ.శ. 570వ సంవత్సరంలో సౌదీ అరేబియాలోని మక్కాలో జన్మించారు. అయితే..ఆయన పుట్టినరోజు తేదిపై మాత్రం స్పష్టత లేదు. దీంతో ఇస్లామిక్ సంవత్సరంలోని మూడవ నెలలో రబీ అల్ అవ్వాల్ 12వ రోజున ఆయన పుట్టినరోజును పాటిస్తారు. ఈ మేరకు ఈ నెల 29న ప్రవక్త జన్మదినం రానుంది. దీంతో ఈ వారంతపు సెలవులు పెరగనున్నాయి. ప్రవక్త పుట్టినరోజున ముస్లింలు అంతా అథ్యాత్మిక చింతనలో గడుపుతారు. ఉపవాసం ఉండటం, పవిత్ర ఖురాన్ పఠిస్తూ ఆథ్యాత్మికత పాటిస్తారు.

 

Back to Top