హైదరాబాద్ నగరంలో సాధారణ స్థితికి తెచ్చేందుకు చర్యలు-కె.టి.ఆర్
- October 17, 2020
హైదరాబాద్:హైదరాబాద్ నగరంలో వరదల ముందున్న సాదారణ స్థితికి తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. శనివారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్‌తో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యల గురించి దిశానిర్ధేశం చేశారు.ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఇస్తున్న సి.ఎం రిలీఫ్ కిట్‌లను వరద బాదిత కుటుంబాల ఇళ్ల వద్దకు వెళ్లి అందజేయాలని స్పష్టం చేశారు. రూ. 2,800 విలువ గల సి.ఎం రిలీఫ్ కిట్‌లో ఒక నెలకు సరిపడ నిత్యవసర వస్తువులతో పాటు 3 బ్లాంకెట్లు ఇస్తున్నట్లు తెలిపారు. వరద ప్రాంతాల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తీసుకువచ్చే అన్ని చర్యలను యుద్దప్రాతిపదికన తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అందుకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పటిష్టంగా నిర్వహించాలని తెలిపారు. యాంటి లార్వా స్ప్రేయింగ్, సోడియం హైపోక్లోరైట్, క్రిమీసంహారక ద్రావనాలను అన్ని వరద ప్రభావిత ప్రాంతాల్లో పిచికారి చేయించాలని ఆదేశించారు. ఎంటమాలజి బృందాల ద్వారా కెమికల్స్ స్ప్రే చేయించాలని సూచించారు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, స్ప్రేయింగ్‌కు అవసరమైతే అదనంగా వాహనాలను సమకూర్చుకోవాలని ఆదేశించారు. వరద ప్రాంతాల్లో నిలిచిన నీళ్లను తొలగించుటకు అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. వరదల వలన నాలాలు, రోడ్లపై పేరుకుపోయిన చెత్త చెదారంతో పాటు బురదను, భవన నిర్మాణ వ్యర్థాలు, శిథిలాలను తొలగించుటకు అవసరమైన సిబ్బందిని, అదనపు వాహనాలను వినియోగించాలని తెలిపారు. అంటు వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్‌తో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉంటున్న ప్రజల ఆరోగ్య సంరక్షణపై నమ్మకాన్ని కలిగించాలని తెలిపారు. మొబైల్ మెడికల్ క్యాంపుల నిర్వహణలో జిహెచ్ఎంసితో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ డి.ఎం.ఇ డాక్టర్ శ్రీనివాస్‌కు సూచించారు. భారీ వర్షాలు, వరదతో దెబ్బతిన్న ఇళ్ల ఎన్యుమరేషన్‌ను చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ సమావేశంలో జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతమహంతి, ఇ.వి.డి.ఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, ఇన్.ఎస్.సి శ్రీదర్, చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్, అదనపు కమిషనర్లు రాహుల్ రాజ్, సంతోష్, జోనల్ కమిషనర్లు బి.శ్రీనివాస్‌రెడ్డి, ఎన్.రవికిరణ్, ఉపేందర్‌రెడ్డి, సామ్రాట్ అశోక్, ప్రావిణ్య, వి.మమత తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్‌కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్‌కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం
- హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేసిన కర్ణాటక ప్రభుత్వం..ఉత్తర్వులు జారీ
- రియాద్‌లో ఉచిత హృదయ వైద్య శిబిరం
- అస్వస్థతతో సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరిక..
- బక్రీద్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన నిఘా: డీజీపీ ఆనంద్
- ఇరాన్‌కు అమెరికా ఆర్థిక షాక్: రూ.145 కోట్ల బహుమతి ప్రకటన!









