షార్జా:పెట్రోల్ బంక్ లోకి దూసుకెళ్లిన కారు..డ్రైవర్ అరెస్ట్

షార్జా:పెట్రోల్ బంక్ లోకి దూసుకెళ్లిన కారు..డ్రైవర్ అరెస్ట్

షార్జా:షార్జాలోని ఓ పెట్రోల్ బంకులోకి కారు దూసుకెళ్లిన ఘటనలో కారు డ్రైవర్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గత వారం అల్ ఖాన్ బ్రిడ్జి సమీపంలోని అల్ ఇతిహాద్ రోడ్డు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొనటంతో బంకు మిషన్ తో పాటు డబ్బులు చెల్లించే కియోస్క్ మిషన్ పూర్తిగా ధ్వంసం అయ్యింది. కారు ఢీ కొనటంతో బంకు సిబ్బందిలో ఇద్దరు వ్యక్తులకు గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. సీసీ ఫూటేజ్ ఆధారంగా కారు వివరాలు సేకరించిన పోలీసులు..వారం రోజుల దర్యాప్తు తర్వాత కారు డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. 

 

Back to Top