తెలంగాణలో కొత్తగా 1,436 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 1,436 కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్:తెలంగాణలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. ఇక నిన్న రాత్రి 8గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,436 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,22,111కు చేరుకుంది. కరోనాతో నిన్న ఒక్క రోజే 6 మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 1,271కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,050 యాక్టివ్ కేసులున్నాయి. 1,98,790 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా నుంచి నిన్న ఒక్కరోజే 2,154 మంది డిశ్చార్జ్ అయ్యారు..ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. ఇక అత్యధికంగా GHMC పరిధిలో నిన్న 249 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 41, 043 టెస్టులను నిర్వహించగా, టెస్టుల సంఖ్య 38,30,503కి చేరుకుంది.

అటు దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 9,70,173 పరీక్షలు చేయగా, 61,871 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో మొత్తం కేసుల సంఖ్య 74,94,552కు చేరింది. అటు గడిచిన 24 గంటల్లో 1033 మంది మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 1,14,031కు చేరుకుంది. ఇక నిన్న దేశ వ్యాప్తంగా 72,614 మంది డిశ్ఛార్జి కాగా ఈ సంఖ్య 65,97,210కు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ ని విడుదల చేసింది. ఇక ప్రస్తుతం దేశంలో 7,83,311 యాక్టివ్ కేసులున్నాయి.

Back to Top