షార్జా బుక్ ఫెయిర్: ఆన్‌లైన్ అలాగే ఇన్-పర్సన్ పార్టిసిపేషన్ మిక్స్
- October 19, 2020
షార్జా:ఈ ఏడాది షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో అమెరికన్ ర్యాపర్ మరియు సోషల్ మీడియా స్టార్ ప్రిన్స్ ఇఎ, కెనడియన్ రచయిత యెన్ మార్టెల్, ఎలిసాబెట్టా డామి వంటి ప్రముఖులు వర్చువల్‌గా సందడి చేయనున్నారు. 39వ ఎడిషన్ షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్, ఎక్స్‌పో సెంటర్ షార్జాలో జరుగుతుంది. నవంబర్ 4 నుంచి 14 వరకు దీన్ని నిర్వహించనున్నాడు. ‘ది వరల్డ్ రీడ్స్ ఫ్రం షార్జా’ పేరుతో ఈ ఈవెంట్‌ని నిర్వహించనున్నారు. ఇండియన్ ఆథర్, పొలిటీషియన్ శశి థరూర్ అలాగే నోవలిస్ట్ రవీందర్‌సింగ్ టాక్స్ ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణలు. కాగా, ఈ ఏడాది విజిటర్స్ సంఖ్యని రోజుకి 5 వేలే పరిమితం చేశారు. మూడు గంటల సమయం ఇస్తారు. ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్నవారికే అవకాశం. కాగా, వర్చువల్‌గా కూడా బుక్‌ఫెయిర్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. గత ఏడాది 2.52 మిలియన్ విజిటర్స్ షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …