అబుధాబి:ప్రైజ్ తగిలిదంటూ ఫోన్ చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక

- October 19, 2020 , by Maagulf
అబుధాబి:ప్రైజ్ తగిలిదంటూ ఫోన్ చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక

అబుధాబి:అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అబుధాబి పోలీసులు హెచ్చరించారు. ప్రైజ్ వచ్చిదంటూ మాయమాటలు చెప్పి బ్యాంక్ వివరాలు, క్రెడిడ్ కార్డు, ఏటీఎం వివరాలను తెలుసుకునే మోసగాళ్లు ఉంటారని వెల్లడించారు. మీకు ప్రైజ్ వచ్చిందని గిఫ్ట్ ను ఇంటికి పంపించాలంటే డెలివరీ ఛార్జ్ కింద కొంత నగదు చెల్లించాలని నమ్మించి..క్రెడిట్ కార్డు, ఏటీఎం కార్డు వివరాలను చెప్పాల్సిందిగా బురిడి కొట్టిస్తారు. వారి మాటలు నమ్మి కార్డు వివరాలు ఇస్తే మీ డబ్బులను దోచేస్తారని అబుధాబి పోలీసులు వివరించారు. కొందరు మోసగాళ్లు బ్యాంక్ ఉద్యోగుల తరహాలో ఫోన్ చేసి..కంప్యూటర్ లో మీ వివరాలను అప్ డేట్ చేయాల్సి ఉందని, అకౌంట్ మీదో కాదో నిర్దారించుకునేందుకు అకౌంట్ వివరాలు, ఆన్ లైన్ బ్యాకింగ్ పాస్ వర్డ్ వివరాలను ఇవ్వాల్సిందిగా కోరుతారు. నిజమే అనుకొని మీరు వివరాలు వెల్లడిస్తే అకౌంట్ నుంచి డబ్బులు దోచేస్తారు. అకౌంట్ వివరాలు, ఏటీఎం, క్రెడిట్ కార్డుల వివరాలు చెప్పాలంటూ ఏ బ్యాంకు నుంచి ఫోన్లు రావన్న విషయం ప్రజలు గుర్తుంచుకోవాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఆన్ లైన్ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఏటీఎం కార్డు పిన్ నెంబర్, క్రెడిట్ కార్డు సీవీవీ నెంబర్ ఇతరులకు చెప్పొద్దని సూచించారు. ఒకవేళ మీకు అనుమానస్పద కాల్స్ వస్తే వెంటనే హాట్ లైన్ నెంబర్ 2828 గానీ, అమన్ సర్వీస్ నంబర్ 8002626 కిగానీ ఫోన్ చేయాలని పోలీసులు కోరారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com