సౌదీలో 96 శాతానికి పెరిగిన కరోనా రికవరి రేటు..400 మార్క్ లోపే పాజిటివ్ కేసులు
- October 19, 2020
రియాద్:సౌదీ అరేబియాలో కరోనా తీవ్రత కొద్దిమేర నిలకడగా కనిపిస్తోంది. సోమవారం కూడా 400 మార్క్ లోపే పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 381 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కింగ్డమ్ పరిధిలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,42,583కి పెరిగింది. మరోవైపు కరోనా కేసులతో పాటు కరోనా రికవరి రేటు కూడా ఆశాజనకంగా కనిపిస్తోంది. గత 24 గంటల్లో 357 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 3,28,895 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో కింగ్డమ్ పరిధిలో కరోనా రికవరి రేటు 96 శాతానికి పెరిగింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా మరో 16 మంది మరణించటంతో మొత్తం మృతుల సంఖ్య 5,201కి చేరింది. ప్రస్తుతం సౌదీ వ్యాప్తంగా 8,487 యాక్టీవ్ కేసులు ఉండగా..844 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







