నాగశౌర్య చిత్రం నాలుగు భాషల్లో...
- February 13, 2016ఊహలు గుసగులాడే సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య, తరువాత ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఆ సినిమా తరువాత వరుసగా నాలుగు ఫ్లాప్ లు పలకరించటంతో తన లేటెస్ట్ సినిమా కళ్యాణ వైభోగమే రిలీజ్ విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. పోటిపడి రిలీజ్ చేసి రిస్క్ చేసే కన్నా సోలో రిలీజ్ కోసం వెయిట్ చేయటమే బెటర్ అని భావిస్తున్నాడు.ప్రస్తుతం నాగశౌర్య ఓ బహు భాష చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఆస్ట్రేలియాలో డిస్ట్రిబ్యూటర్ గా పలు విజయవంతమైన చిత్రాలను అందించిన రామ్ నిర్మాతగా, సాయి చైతన్యను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాకు నాగశౌర్యను హీరోగా ఎంపిక చేసుకున్నారు.భారీగా తెరకెక్కనున్న ఈ సినిమాను ఒకేసారి నాలుగు భాషల్లో రూపొందించాలని భావిస్తున్నారు. మరి ఈ సినిమాతో నాగశౌర్య సౌత్ లో స్టార్ ఇమేజ్ అందుకుంటాడేమో చూడాలి.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ