విజయ్ సేతుపతి కూతురిని రేప్ చేస్తామంటూ బెదిరింపులు..!
- October 20, 2020
సోషల్ మీడియా వేదికగా ఆకతాయిలు చేస్తున్న కామెంట్స్ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల ధోని కూతురిని రేప్ చేస్తామంటూ ఓ టీనేజర్ బెదిరింపులకి దిగడం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం మరచిపోకముందే మరో ఆకతాయి తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూతురిని రేప్ చేస్తానంటూ బెదిరింపులకి దిగాడు. దీనిపై నెటిజన్స్ తో పాటు పలువురు ప్రముఖులు మండిపడుతున్నారు.
శ్రీలంక లెజండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ '800' లో విజయ్ సేతుపతిని లీడ్ రోల్ కోసం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత అనేక వివాదాలు తలెత్తాయి. విజయ్ సేతుపతిని ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోమ్మని తమిళులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మురళీధరన్ స్వయంగా లేఖ విడుదల చేస్తూ నా వలన మీ కెరీర్ నాశనం చేసుకోవద్దు, దయచేసి ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలని విజయ్‌కు సూచించారు. వెంటనే దీనిపై స్పందించిన విజయ్ సేతుపతి తన ట్విట్టర్లో.. సినిమా నుండి వైదొలుగుతున్నట్టు ప్రకటించి ధన్యవాదాలు.. ఇక సెలవు అని పేర్కొన్నారు.
విజయ్ సేతుపతి 800 ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు ప్రకటించిన కొద్ది సమయానికే ఆయన చిన్న కుమార్తెపై అత్యాచార బెదిరింపులకి దిగడం అందరిని అవాక్కయ్యేలా చేసింది. విజయ్ సేతుపతి.. నీ కుమార్తెపై అఘాయిత్యం చేస్తే, ఈలం తమిళుల బాధ ఎలా ఉంటుందో నీకు అర్ధమవుతుంది అని ట్విట్టర్లో ఓ నెటిజన్ బెదిరించాడు. ఈ ట్వీట్‌ని నెటిజన్స్‌తో పాటు పలువురు ప్రముఖులు ఖండిస్తున్నారు. సింగర్ చిన్నయి.. నెటిజన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి నీచమైన వ్యక్తులే సమాజంలో లైంగిక నేరాలకు పాల్పడుతున్నారు. అమ్మాయిలని బహిరంగంగా అత్యాచారం చేస్తానని బెదిరించిన వ్యక్తి కూడా నేరస్తుడే. ఇంత జరుగుతున్న చూస్తూ ఊరుకుంటున్నారంటే సిగ్గుచేటు' అంటూ అడయార్ డిప్యూటీ కమిషనర్, చెన్నై పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది చిన్మయి.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!