ఖర్చులు పెరగడంతో బహ్రెయిన్ నిర్వాసితుల ఇబ్బందులు

- February 14, 2016 , by Maagulf
ఖర్చులు పెరగడంతో బహ్రెయిన్ నిర్వాసితుల ఇబ్బందులు

వివిధ రాయితీలు తొలగించడంతో పెరిగిన ఖర్చుల కారణంగా బహ్రెయిన్ లో నిర్వాసితుల జీవనం ఎంతో దుర్బరంగా మారుతోంది. గత ఎనిమిదేళ్లుగా బహ్రెయిన్ లో నివసిస్తున్న అమీన్ నసీరుద్దీన్  ఈ ఏడాది చివరిలోపు దేశం విడిచి వెళ్లేందుకు నిర్ణయం తిసుకొన్నట్లు తెలిపాడు. పేరు తెలియచేయడానికి ఇష్టపడని మరో నిర్వాసితుడు పెరిగిన ధరల కారణంగా తనతో ఉంటున్న కుటుంబాన్ని తిరిగి స్వదేశంకు పంపుతున్నట్లు తెలిపాడు. అత్యధిక శాతం మంది బహ్రెయిన్ నిర్వాసితులు పెరిగిన ధరల కారణంగా తాము విదేశంలో ఉండాలా లేక స్వదేశం కు తిరిగి వెళ్ళాలో నిర్ణయించుకోలేక గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. తక్కువ ఆదాయాలు ఉన్న ఉద్యోగులు , సాధారణ కార్మికులు పరిస్థితి మరింత కష్టంగా మారింది. ఇంటి అద్దెలు , నెలవారీ బిల్లులు చెల్లించడానికి నానా తంటాలు పడుతున్నారు. అదే సమయంలో జీతం డబ్బులలో కొంత మొత్తాన్ని స్వదేశంలో ఉన్న తమ కుటుంబాలకు పంపించేందుకు అవస్థలు చెందుతున్నారు. పెరిగిన ఖర్చులు తమ అల్ప జీతాలను హరించివేస్తున్నాయని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ సందర్బంగా వలస కార్మికుల రక్షణ సంఘం ( ఎం.డబ్ల్యూ.పి.ఎస్.) అధ్యక్షురాలు మరిఎత్త దాస్ మాట్లాడుతూ , పలువురు  బహ్రెయిన్ నిర్వాసితులు బాద్యతల కారణంగా ఇదే దేశంలో ఉండిపోక తప్పడం లేదని తెలిపారు. వీరు అప్పులు తీర్చడానికి, కుటుంబ భారం మోయాల్సిన నేపధ్యంలో బహ్రెయిన్ విదిచివెళ్ళలేక ఇక్కడే ఉండిపోతున్నారని ఆమె అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com