పరీక్షింపబడిన కోవిడ్ 19 వాక్సిన్ మాత్రమే కొనుగోలు చేస్తాం: సౌదీ ఆరోగ్య శాఖ మంత్రి
- October 20, 2020జెడ్డా: సౌదీ హెల్త్ మినిస్టర్ తవ్ఫిక్ అల్ రబియా మాట్లాడుతూ, కరోనా వ్యాక్సిన్ విషయంలో సౌదీ రాజీ పడబోదనీ, పూర్తిస్థాయిలో సురక్షితం అని నిర్ధారితమైన వ్యాక్సిన్‌ని మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పారు. పలు దేశాలు కరోనా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో కొన్ని దేశాలు వ్యాక్సిన్‌ని తయారు చేశామని చెబుతున్నాయి. అయితే, వ్యాక్సిన్‌పై సందేహాలు మాత్రం అలాగే వున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సౌదీ ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టం చేయడం జరిగింది. ఒక్కోసారి ప్రయోగాల సందర్భంగా నెగెటివ్ ఫలితాలు రావొచ్చనీ, వాటిని అధిగమించి వ్యాక్సిన్ విషయంలో విజయవంతమవ్వొచ్చనీ, ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోందని తావ్ఫిక్ అల్ రబియా చెప్పారు. కాగా, సౌదీ అరేబియాలో సోమవారం 381 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా దేశంలో ఇప్పటిదాకా 348,583 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు 5,201 మంది కరోనాతో ప్రాణాలు కోలోపయారు. 328,895 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్