రోడ్డు ప్రమాదంలో నలుగురు ఆసియా జాతీయుల మృతి

రోడ్డు ప్రమాదంలో నలుగురు ఆసియా జాతీయుల మృతి

బహ్రెయిన్: కైరో: బహ్రెయిన్‌లో చోటు చేసుకున్న ఓ రోడ్డు ప్రమాదంలో నలుగురు ఆసియా జాతీయులు మృతి చెందారు. మరో ఇద్దరు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. బహ్రెయిన్‌ నార్త్‌ గవర్నరేట్‌లోని అల్‌ హమాలా ప్రాంతంలోని మెయిన్‌ రోడ్డుపై కొన్ని కార్లు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. మొత్తం మూడు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 2018 నాటి గణాంకాల ప్రకారం అధిక వేగం 30.3 శాతం ప్రమాదాలకు కారణం. రెడ్‌ లైట్స్‌ ప్రయాణం 34.9 ప్రమాదాలకు కారణమవుతోంది. రోడ్‌ ఉల్లంఘనల్లో మేల్‌ డ్రైవర్లదే కీలక పాత్ర. 83.7 శాతం వుంది వీరి పాత్ర.

 

Back to Top