షిషా బ్యాన్‌పై కేఫ్‌ ఓనర్ల‌ నిరసన

షిషా బ్యాన్‌పై కేఫ్‌ ఓనర్ల‌ నిరసన

కువైట్: కువైట్‌లో కాఫీ షాప్స్‌ ఓనర్స్‌, ఒకే నెలలో రెండోసారి నిరసన వ్యక్తం చేశారు షిషా బ్యాన్‌ని నిరసిస్తూ. ఆగస్ట్‌లో కువైట్‌ ప్రభుత్వం, కేఫ్‌లను తెరిచేందుకు అనుమతిచ్చిన సంగతి తెల్సిందే. అయితే, షిషాకు మాత్రం అనుమతిన్విలేదు. కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో షిషాను బ్యాన్‌ చేశారు. అయితే, షాషాపై బ్యాన్‌ వల్ల తమ వ్యాపారాలు సజావుగా సాగడంలేదని కేఫ్‌ల ఓనర్స్‌ వాపోతున్నారు. 5,000 కుటుంబాలు సుమారు 5,0000 కేఫ్‌లనునిర్వహిస్తున్నాయని కేఫ్‌ ఓనర్స్‌ ప్రతినిది¸ నవాఫ్‌ అల్‌ ఫజెహ్‌ చెప్పారు. కాగా, అద్దెలు చెల్లించలేని పరిస్థితుల్లో నిర్వాహకులు వున్నారనీ, అలాంటివారికి అరెస్ట్‌ వారెంట్లు కూడా వస్తున్నాయని చెప్పారు. షిషాపై బ్యాన్‌ కొనసాగితే, వ్యాపారాల నిర్వహణ ఎలా సాగుతుందని ప్రశ్నిస్తున్నారు. హెల్త్‌ మినిస్ట్రీ, షిషా బ్యాన్‌పై సరైన కారణాలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. రెన్యువల్‌ లైసెన్సులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో వున్నామని కేఫ్‌ ఓనర్స్‌ వాపోతున్నారు.

 

Back to Top