ఆహా! అమెజాన్ ఉద్యోగస్తులకు బంపర్ ఆఫర్

ఆహా! అమెజాన్ ఉద్యోగస్తులకు బంపర్ ఆఫర్

కోవిడ్ మహమ్మారి ఇంకా పూర్తిగా మటుమాయం కాలేదు కనుక తమ ఉద్యోగులు ఇష్టమైతే వచ్ఛే ఏడాది జూన్ 30 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయవచ్చునని అమెజాన్ సంస్థ ప్రకటించింది. నిజానికి తమ సిబ్బందికి ఈ సంస్థ జనవరి వరకే ఆప్షన్  ఇచ్చింది. కానీ కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో దీన్ని వచ్ఛే జూన్ వరకు పొడిగించినట్టు అమెజాన్ సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ ఏడాది యుఎస్ లోని అమెజాన్ ఉద్యోగుల్లో సుమారు 19 వేలమంది కరోనా వైరస్ బారిన పడ్డారు, పాండమిక్ సమయంలోనూ వేర్ హౌస్ లను తెరచి ఉంచడంవల్ల ఉద్యోగుల ఆరోగ్యాన్ని సంస్థ రిస్క్ లో పెట్టిందని కొంతమంది సీనియర్ సిబ్బంది ఆరోపించారు.

Back to Top