పోలీస్ అమరవీరుల దినోత్సవం..జగన్ కీలక ప్రకటన
- October 21, 2020
ఏపీలోని నిరుద్యోగులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ అందించారు. తాజాగా విజయవాడలో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి పోలీస్ శాఖలోని ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొత్తం 6500 పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను డిసెంబర్లో జారీ చేస్తామని సీఎం జగన్ తెలిపారు.
అలాగే జనవరిలో పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. ఇక ఈ పోస్టులను నాలుగు దశల్లో భర్తీ చేస్తామని సీఎం అన్నారు. అంతేకాదు పోలీస్ శాఖకు చెల్లించాల్సిన బకాయిలను కూడా వెంటనే చెల్లిస్తామని తెలిపారు. పోలీస్ అమరవీరులందరికీ జేజేలు పలికిన సీఎం.. ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో ఎవర్నీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కుల, మత ఘర్షణల్లో పోలీసులు పారదర్శకంగా పని చేయాలన్నారు. కాగా, దిశ బిల్లును కేంద్రం త్వరలోనే ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన