వేగవంతంగా వలసదారుల్ని స్థానికులతో భర్తీ చేయాలని మినిస్టర్‌ ఆదేశం

- October 21, 2020 , by Maagulf
వేగవంతంగా వలసదారుల్ని స్థానికులతో భర్తీ చేయాలని మినిస్టర్‌ ఆదేశం

మస్కట్‌: వలస వర్క్‌ ఫోర్స్‌ని ఒమన్‌ జాతీయులతో భర్తీ చేసే దిశగా ఆయా సంస్థలు వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని మినిస్టర్‌ ఆఫ్‌ లేబర్‌ ఆదేశించారు. ఒమన్‌ ఇన్వెస్టిమెంట్‌ అథారిటీతో మినిస్ట్రీ ఈ మేరకు ఓ మీటింగ్‌ ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్‌ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌ హెడ్స్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో రీప్లేస్‌మెంట్‌ ప్లాన్స్‌ గురించిన చర్చ జరిగింది. మినిస్టర్‌ ఆఫ్‌ లేబర్‌ డాక్టర్‌ మహాద్‌ బిన్‌ సైద్‌ బిన్‌ అలి బావోయిన్‌ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. వర్క్‌ ఫోర్స్‌ని ఒమనీయులతో నింపే క్రమంలో ఒమనీయులకు తగిన శిక్షణ ఇవ్వాల్సి వుంటుందని మినిస్టర్‌ సూచించడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com