మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత
- October 22, 2020
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత
హైదరాబాద్ :తెలంగాణ మొట్టమొదటి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత నెలలో నాయిని నర్సింహారెడ్డి కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత శ్వాస సంబంధ సమస్యలు వచ్చాయి. వైద్య పరీక్షల్లో న్యూమోనియా అని తేలింది. కరోనా కారణంగా కలిగిన న్యూమోనియాతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆయన తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు ప్రకటించారు.
ఆయన ఆరోగ్యంగా కోలుకుని తిరిగి వస్తారని అంతా అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణ వార్త అందరిని తీవ్ర బాధల్లోకి నెట్టేసింది.నాయిని మృతికి సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. అంతకుముందు ఆస్పత్రికి వెళ్లిన కేసీఆర్.. నాయిని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. డాక్టర్లను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నాయినికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లుకు సూచించారు. కానీ ఇంతలోనే ఆయన మరణించారన్న వార్త అందడంతో.. ఆయనకు సంతాపం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు