34 దేశాలకు చెందినవారికి డైరెక్ట్‌ ఎంట్రీ

- October 22, 2020 , by Maagulf
34 దేశాలకు చెందినవారికి డైరెక్ట్‌ ఎంట్రీ

కువైట్ సిటీ:మినిస్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ షేక్‌ డాక్టర్‌ బాసిల్‌ అల్‌ సబా, కువైట్‌ ఎయిర్‌ వేస్‌ అలాగే జజీరా ఎయిర్‌ వేస్‌ ప్రతినిథులతో ఈ రోజు సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా రెండు కంపెనీల నుంచి 34 దేశాలకు డైరెక్ట్‌ విమానాలు నడిపే విషయమై చర్చలు జరపనున్నారు. 14 రోజుల క్వారంటైన్‌ నిబంధనలతో సంబంధం లేకుండా విమానాలు నడిపే విషయమై ఈ సమావేశంలో చర్చిస్తారు. నిషేధిత 34 దేశాలకు చెందిన ప్రయాణీకుల విషయమై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. కాగా, ఆయా రిస్క్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు ఎయిర్‌పోర్ట్‌లో పిసిఆర్‌ టెస్ట్‌ చేస్తారు. అనంతరం వారికి నిబంధనలకు అనుగుణంగా క్వారంటైన్‌ విధిస్తారు. అయితే, ఈ క్వారంటైన్‌ని ఏడు రోజులకు కుదించాలన్న దిశగా చర్చలు జరుగుతున్నాయి.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com