34 దేశాలకు చెందినవారికి డైరెక్ట్ ఎంట్రీ
- October 22, 2020
కువైట్ సిటీ:మినిస్టర్ ఆఫ్ హెల్త్ షేక్ డాక్టర్ బాసిల్ అల్ సబా, కువైట్ ఎయిర్ వేస్ అలాగే జజీరా ఎయిర్ వేస్ ప్రతినిథులతో ఈ రోజు సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా రెండు కంపెనీల నుంచి 34 దేశాలకు డైరెక్ట్ విమానాలు నడిపే విషయమై చర్చలు జరపనున్నారు. 14 రోజుల క్వారంటైన్ నిబంధనలతో సంబంధం లేకుండా విమానాలు నడిపే విషయమై ఈ సమావేశంలో చర్చిస్తారు. నిషేధిత 34 దేశాలకు చెందిన ప్రయాణీకుల విషయమై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. కాగా, ఆయా రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు ఎయిర్‌పోర్ట్‌లో పిసిఆర్ టెస్ట్ చేస్తారు. అనంతరం వారికి నిబంధనలకు అనుగుణంగా క్వారంటైన్ విధిస్తారు. అయితే, ఈ క్వారంటైన్‌ని ఏడు రోజులకు కుదించాలన్న దిశగా చర్చలు జరుగుతున్నాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు