IPL లాగా LPL టోర్నీ..ఓ జట్టును కొనేసిన సల్మాన్
- October 22, 2020
ఐపీఎల్ లాగా మరో టోర్నమెంట్ పేరు ప్రస్తుతం వరల్డ్ వైడ్ హీట్ పెంచుతోంది. అదే లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పిఎల్). ఇందు లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కుటుంబం కాండీ టస్కర్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ .. వారి తండ్రి.. ప్రముఖ స్క్రిప్ట్-రచయిత సలీం ఖాన్... కన్సార్టియంలో భాగమైన సోహైల్ ఖాన్ ఇంటర్నేషనల్ ఎల్ఎల్పి లో పెట్టుబడి పెట్టారని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ లీగ్ లో చాలా సామర్థ్యాన్ని చూస్తున్నామని సల్మాన్ సోదరుడు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మా జట్టులో ఉన్న ఆటగాళ్ళు.... సాధారణంగా లీగ్ .. అలాగే అభిమానుల అభిరుచి ఇవన్నీ చూసి కొనుగోలు చేసామని సోహైల్ ప్రముఖ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇకపై సల్మాన్ అన్ని కాండీ మ్యాచ్ లకు హాజరవుతారు అని ఆర్బాజ్ చెప్పారు. ఖాన్ కుటుం బంలోని ముగ్గురు సోదరులలో చిన్నవాడు అర్బాజ్. సల్మాన్ పెద్దవాడు.. అన్న సంగతి విధితమే. లంకా ప్రీమియర్ లీగ్ 2020 నవంబర్ 21 నుండి డిసెంబర్ 13 వరకు కొనసాగనుందని ఆర్బాజ్ తెలిపారు.
లంక ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ లో కొలంబో కింగ్స్ .... దంబుల్లా హాక్స్.... గాలే గ్లాడియేటర్స్.. జాఫ్నా స్టాలియన్స్ .. కాండీ టస్కర్స్ అనే ఐదు జట్లు ఉన్నాయి. కాండీ టస్కర్స్ జట్టులో కుసల్ పెరెరా.. క్రిస్ గేల్.... లియామ్ ప్లంకెట్... వహాబ్ రియాజ్ .. కుసల్ మెండిస్ ఉన్నారు. అన్నింటికంటే మించి.. `యూనివర్స్ బాస్` క్రిస్ గేల్ ఇప్పుడు తన జట్టులో భాగమైనందుకు సోహైల్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఎల్పిఎల్ ప్లేయర్ డ్రాఫ్ట్ గత 48 గంటల్లో జరిగింది. ప్లేయర్ లభ్యత నిబంధనలపై అన్ని గందరగోళాలు ఉన్నప్పటికీ ఖాన్ తాను కలిసి ఉన్న జట్టుతో సంతోషంగా ఉన్నానని చెప్పాడు.
LPL లోని గాలె ఫ్రాంచైజ్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్ఎ.ల్) లో క్వెట్టా గ్లాడియేటర్స్ నడుపుతున్న అదే కన్సార్టియం యాజమాన్యంలో ఉంది. అయితే ఇతర జట్లను ఎవరు కలిగి ఉన్నారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఎల్పిఎల్ కు మరో రెండు భారతదేశానికి చెందిన కన్సార్టియంలు ఉన్నాయని.. ఒక జట్లు శ్రీలంకకు చెందినదని తెలిసింది. శ్రీలంక మాజీ ఆల్ రౌండర్.. వ్యాఖ్యాత రస్సెల్ ఆర్నాల్డ్ శ్రీలంకకు చెందిన కన్సార్టియంతో సంబంధం కలిగి ఉన్నాడని తెలిసింది. దుబాయ్ కు చెందిన ఇన్నోవేటివ్ ప్రొడక్షన్ గ్రూప్ (ఐపిజి) ఈ ఏడాది ఆగస్టులో ఎల్.పి.ఎల్ కు మార్కెటింగ్ హక్కులను ప్రదానం చేసింది. ఈ టోర్నమెంట్ మొదటిసారి సెప్టెంబర్ లో జరగాల్సి ఉండగా... మహమ్మారి కారణంగా వాయిదా వేయవలసి వచ్చింది.
2020 లంకా ప్రీమియర్ లీగ్లో పాల్గొనే మరికొన్ని పెద్ద పేర్లు పరిశీలిస్తే... షోయబ్ మాలిక్ (జాఫ్నా స్టాలియన్స్)... డేవిడ్ మిల్లెర్ ... కార్లోస్ బ్రాత్వైట్ (దంబుల్లా హాక్స్)... ఆండ్రీ రస్సెల్... ఫాఫ్ డు ప్లెసిస్.. ఏంజెలో మాథ్యూస్ (కొలంబో కింగ్స్)... లాసిత్ మలింగ.. షాహిద్ అఫ్రిది... కోలిన్ ఇంగ్రామ్ .. మహ్మద్ అమీర్ (గాలే గ్లాడియేటర్స్) తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు