గోడ కూలి సౌదీ బాలుడి మృతి

- October 22, 2020 , by Maagulf
గోడ కూలి సౌదీ బాలుడి మృతి

సౌదీ: ఇ-లెర్నింగ్‌ నిమిత్తం ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కోసం ప్రయత్నిస్తుండగా ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనలో మరో బాలుడు గాయపడ్డాడు. అసిర్‌ ప్రాంతంలోని రిజాల్‌ అల్మా గవర్నరేట్‌లగల అల్‌ అయానా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఓ గోడపైకి సోదరులు అహ్మద్‌ మరియు జమీల్‌ అలి అసిరి ఎక్కగా, దురదృష్టవశాత్తూ ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నారులపై గోడ కూలింది. రెండో గ్రేడ్‌ చదువుతున్న అహ్మద్‌ ప్రాణాలు కోల్పోయాడు. అతని సోదరుడు జమిల్‌ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్నాడు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com