బహ్రెయిన్:ఆన్ లైన్ క్లాసెస్ కు మరింత సాంకేతిక..అదనంగా కొత్త టెలిఫోన్ నెంబర్లు
- October 23, 2020
మనామా:కరోనా కారణంగా నేరుగా క్లాసులను నిర్వహించే అవకాశం లేకపోవటంతో ఆన్ లైన్ ద్వారా విద్యార్ధులకు క్లాసులను నిర్వహించే ఏర్పాట్లు చేసింది బహ్రెయిన్ విద్యాశాఖ. అయితే..ఎంత చెప్పిన నేరుగా తరగతి గదిలో చదివే చదువుకు ఆన్ లైన్ క్లాసుల చదువులకు కొంత వ్యత్యాసం ఉంటూనే ఉంది. విద్యార్ధులకు వచ్చే సందేహాలను నివృత్తి చేయటం సమస్యగా మారుతోంది. అయితే..ఈ అసౌకర్యం నుంచి విద్యార్ధులకు కొంతమేర వెసులుబాటు కలిగించేందుకు బహ్రెయిన్ విద్యాశాఖ ఆన్ లైన్ క్లాసుల నిర్వహణకు సాంకేతిక బృందాలను మరింత విస్తరించింది. ఇప్పటికే ఉన్న ఫోన్ లైన్లకు తోడుగా మరికొన్ని ఫోన్ లైన్లను జత చేసింది. ఇక నుంచి విద్యార్ధులకు ఎలాంటి సందేహాలున్నా..సమస్యలు ఉన్నా 17896018, 17896163, 17896076, 17896024, 17896090 నెంబర్లకు వర్కింగ్ ఆవర్స్ లో కాల్ చేయాలని సూచించింది. వర్చువల్ క్లాస్ రూమ్స్ తో కనెక్ట్ అయ్యేందుకు 17278923, 17278429, 17278742, 17278236, 17278892 నెంబర్ కి కాల్ చేయాలని వెల్లడించింది. ఇక www.edunet.bh, yalla365.net ద్వారా విద్యార్ధులకు సాంకేతిక సహాయం పొందవచ్చని విద్యా మంత్రిత్వ శాఖ వివరించింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు