కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించిన ప్రవాసీపై దేశబహిష్కరణ
- October 23, 2020
మస్కట్:కరోనా వ్యాప్తి నియంత్రణకు సుప్రీం కమిటీ సూచించిన నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది ఒమన్. మార్గనిర్దేశకాలను పాటించకుండా వైరస్ వ్యాప్తికి దోహదపడేట్లు చేస్తున్న వ్యక్తులను గుర్తించి ఇప్పటికే భారీ జరిమానాలను విధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కోవిడ్ 19 నిబంధనలను ఉల్లంఘించిన నేరానికి ఓ ప్రవాసీయుడిపై ఏకంగా దేశ బహిష్కరణ వేటు పడింది. పాక్షిక కర్ఫ్యూ అమలులో ఉన్న సమయంలో నిందితుడు తన నివాసంలో అహార పదార్ధాలను విక్రయించాడన్నది అధికారుల ఆరోపణ. దీంతో అతన్ని అరెస్ట్ చేసి న్యాయవిచారణకు తరలించారు. విచారణ జరిపిన ధోఫర్ ప్రాథమిక న్యాయస్థానం నిందితుడికి నెల రోజుల జైలు శిక్షతో పాటు శిక్షా కాలం పూర్తవగానే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!