అస్సిర్ పర్వత ప్రాంతంలో దట్టమైన మంటలు..ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ తీవ్ర ప్రయత్నాలు
- October 23, 2020
సౌదీ అరేబియా:సౌదీ నైరుతి ప్రాంతంలోని నస్సిర్ పర్వతాల్లో రాజుకున్న అగ్ని తీవ్రరూపం దాల్చింది. బుధవారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకోగా..ఇప్పటికే పర్వత ప్రాంతంలోని 70 శాతంపైగా చెట్లు అగ్గికి ఆహుతయ్యాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కొండ ప్రాంతం కావటంతో ఘటనా స్థలానికి వాహనాలను కూడా తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు బలమైన గాలులు వీస్తుండటం మంటలను అదుపులోకి తీసుకురావటానికి అవరోధంగా మారుతోంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ మంటల తీవ్రత సమీప నివాసిత ప్రాంతాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది తీవ్ర కృషి చేస్తోంది. అయితే..పర్వతాల్లో మంటలు చెలరేగటానికి కారణాలు ఏంటో అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు